Sunday, January 19, 2025
Homeసినిమా‘ఐరావతం’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

‘ఐరావతం’ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Iravatham: with Different Story:
రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్, అరుణ్ కుమార్, రవీంద్ర, సంజయ్ నాయర్, జయవాహిని నటీనటులుగా రూపొందిన చిత్రం ‘ఐరావతం’. ఈ చిత్రానికి సుహాస్ మీరా దర్శకత్వం వ‌హించారు. రాంకీ పలగాని, లలితకుమారి తోట, బాలయ్య చౌదరిలు సంయుక్తంగా  ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ “ఈ కథ విని నన్ను నమ్మి ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా వెన్ను తట్టి నడిపినందుకు మా నిర్మాత‌కు చాలా కృతజ్ఞతలు. ఒక వినూత్నమైన కథతో ఐరావతం నిర్మించడం జరిగింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రం కోసం పని చేసిన సాంకేతిక వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా” అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ “ఐరావతం కథలోని ఇంటెన్సిటీ తగ్గకుండా జనాదరణ పొందే విధంగా నిర్మాణ విలువలతో నిర్మించటం జరిగింది. ఇది ఖ‌చ్చితంగా ప్రేక్షకాదరణ పొందే చిత్రమవుతుందనే విషయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన త‌ర్వాత‌ అర్థమైంది. ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం అని తెలియ జేస్తున్నాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్