Sunday, November 24, 2024
HomeTrending NewsKarnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గుచూపింది. కాగా.. పవర్ షేరింగ్ కోసం డీకే శివకుమార్ తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గత 24గంటలుగా ఎడతెగని చర్చలు జరిపారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకు ఉందని కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు సోనియా దృష్టికి తీసుకెళ్లడంతో మొగ్గు సిద్ధరామయ్య వైపే చూపింది. దీంతో అధిష్టానం సైతం సిద్ధరామయ్యకే జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్యే కర్ణాటక కు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు సుగమం అయ్యాయి.

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును కాసేపట్లో అధికారిక ప్రకటన ద్వారా వెలువరించనున్నారు. సిద్ద రామయ్య సిఎంగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక డీకే శివకుమార్ కు డెప్యూటీ సీఎం తో పాటు ఇరిగేషన్, విద్యుత్ శాఖ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం ఆయనను ఒప్పించింది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా డీకే శివకుమార్ కొనసాగుతారు. రేపు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరుగనుంది. సీఎల్పీ భేటీలో శాసనసభాపక్ష నేతగా సిద్ధరామయ్య ను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. రేపు మధ్యాహ్నం3/30 నిమిషాలకు కంఠీరవ స్టేడియం‌లో కర్నాటక సీఎం గా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏడాదిన్నర పాటు సిఎం గా సిద్దరామయ్య కొనసాగే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్