Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Suggestion: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్  కావడంతో మ‌రో సినిమా చేయాలనుకున్నారు. ఇప్ప‌టికే కాంబినేషన్ కూడా సెట్ అయ్యింది.  ఈ  సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాలి కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆల‌స్యం అయ్యింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో ఈ భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆచార్య టైమ్ లోనే సోష‌ల్ మీడియాకి దూర‌మ‌య్యారు. ఒక‌ప్పుడు కొర‌టాల సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారు. ఆర‌త్వాత ఏమైందో ఏమో కానీ.. సోష‌ల్ మీడియాకు దూర‌మ్యారు. అయితే.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాల‌ని ఎన్టీఆర్ కొర‌టాల‌కు స‌ల‌హా ఇచ్చార‌ట‌. దీంతో ఎన్టీఆర్ ఇచ్చిన స‌ల‌హాను కొర‌టాల పాటిస్తారా..?  మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ అవుతారా..? అనేది ఆస‌క్తిగా మారింది.

ఆచార్య సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో క‌థ పై మ‌రోసారి వ‌ర్క్ చేయ‌మ‌ని కొర‌టాల‌కు ఎన్టీఆర్ చెప్పారు. ఎన్టీఆర్ చెప్పిన‌ట్టుగానే క‌థ‌లో కీల‌క‌మైన మార్పులు చేశారట‌. తాజాగా చేసిన మార్పులతో ఎన్టీఆర్ సంతృప్తి చెందాడ‌ని తెలిసింది. ఈ మూవీలో హీరోయిన్ ఎవ‌రనేది ఇంకా  తేలలేదు. క‌థానాయికను ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తార‌ని స‌మాచారం.

Also Read : ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో NTR 30.. మోష‌న్ పోస్టర్ విడుదల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com