Sunday, June 14, 2026
Homeసినిమాచిరంజీవి పేరు మార్చుకున్నారా?

చిరంజీవి పేరు మార్చుకున్నారా?

No Change: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తాప‌డింది. ఈ సినిమా వ‌ల‌న దాదాపు 70 కోట్లు న‌ష్టం వ‌చ్చింది. దీంతో చిరంజీవి చేస్తున్న ‘గాడ్ ఫాద‌ర్‘, ‘భోళా శంక‌ర్’, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌కు ఆశించిన స్థాయిలో బ‌జ్ రావ‌డం లేద‌ని.. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం చిరంజీవి పేరు స్పెల్లింగ్ లో స్వల్ప మార్పు చేసుకున్నారని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో చిరంజీవి పేరు మార్చుకున్నార‌నేది హాట్ టాపిక్ అయ్యింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… చిరు గాడ్‌ఫాదర్ ఫస్ట్ టీజర్ విడుదలైన సందర్భంగా.. Chiranjeevi అనే పేరు Chiranjeeevi గా కనిపించింది. ఆయన తన పేరులో మరో E ని అదనంగా చేర్చారు. గతంలో చాలా మంది నటీనటులు, హీరో,హీరోయిన్స్ తమ పేర్లలో స్పెల్లింగ్‌లను మార్చుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా వారి బాటలోనే నడిచారంటూ ప్ర‌చారం జ‌రిగింది. చిరంజీవి తన కెరీర్ లో ఇదివరకెన్నడూ ఆచార్య లాంటి భారీ డిజాస్టార్‌ను ఎదుర్కోలేదు.

గాడ్‌ఫాదర్ చిత్రం కోసం కావాలనే పేరు Chiranjeeevi గా మార్చారని  అనుకున్నారు. అయితే.. ఇందులో అస‌లు వాస్త‌వం ఎంత అని ఆరా తీస్తే.. ఏమాత్రం నిజం లేద‌ని తెలిసింది. గాడ్ ఫాద‌ర్ టీమ్ టీజ‌ర్ ను రెడీ చేసేట‌ప్పుడు కంగారులో అలా టైప్ చేయ‌డం వ‌ల‌న జ‌రిగింది కానీ.. చిరంజీవి పేరులో ఎలాంటి మార్పులు చేసుకోలేద‌ని స్ప‌ష్టం చేశారు. అదీ.. సంగ‌తి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular