Sunday, June 14, 2026
Homeసినిమా'మాచర్ల' నుంచి నితిన్ హిట్టు పట్టుకొచ్చేనా? 

‘మాచర్ల’ నుంచి నితిన్ హిట్టు పట్టుకొచ్చేనా? 

నితిన్ టీనేజ్ లోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు .. రీసెంట్ గా 20 ఏళ్ల కెరియర్ ను కూడా పూర్తిచేసుకున్నాడు. హిట్ లు .. ఫ్లాపులు రెండూ చూసిన అనుభవం ఆయనకి పుష్కలంగా ఉంది. ‘భీష్మ’ సినిమాకి ముందు కూడా నితిన్ కి వరుస ఫ్లాపులు ఉన్నాయి. కానీ ‘ భీష్మ’ తరువాత ఇక మళ్లీ హిట్ల మెట్లపై పరిగెడతాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత కూడా ఆయన ప్రయాణం ఫ్లాపుల మధ్యలోనే కొనసాగింది. ఆ జాబితాలో ‘చెక్’ .. ‘రంగ్ దే’ .. ‘మాస్ట్రో’ సినిమాలు కనిపిస్తాయి. ఈ సినిమాలు ఒకదానికి మించి ఒకటి పరాజయాలను అందుకున్నాయి.

మూడు ఫ్లాపుల తరువాత నితిన్ చేసిన సినిమా ఇది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా హిట్ కావడం నితిన్ కి చాలా అవసరం .. పైగా ఇది ఆయన సొంత సినిమా. వరుస ఫ్లాపులతో ఉన్న నితిన్ కొత్త దర్శకుడితో ఈ సినిమా చేస్తుండటం ఆశ్చర్యపోవలసిన విషయమే. ఇంతవరకూ ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా హిట్టు ఆయనకి కూడా కీలకమే.

ఇక తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి కృతి శెట్టి వరుస హిట్లను అందుకుంటూ వచ్చింది. హ్యాట్రిక్ హిట్ తరువాత ఆమె చేసిన ‘ది వారియర్’ ఫ్లాప్ అనిపించుకుంది. ఆ తరువాత ఎక్కువ గ్యాప్ కూడా లేకుండా కృతి శెట్టి నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా తరువాత రావలసిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా అప్ డేట్ ఏమిటనేది తెలియడం లేదు. అందువలన  కృతి శెట్టికి కూడా ‘మాచర్ల’ సక్సెస్ చాలా అవసరమే. ఇంతమంది ఆశలను నెరవేర్చవలసిన బాధ్యత ‘మాచర్ల నియోజకవర్గం’పైనే ఉంది మరి.

Also Read సముద్రఖని దర్శకత్వంలో చేయాలనుంది: నితిన్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular