Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

RS tickets: రాజ్యసభ సీటు ఇవ్వడానికి ఆంధ్ర ప్రదేశ్ లో సమర్థులు, వెనుకబడిన వర్గాల వారు లేరా అని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.  రాజ్యసభ టికెట్లు ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఆంధ్ర వారికి ఇచ్చారని అంటే సమన్యాయం చేసినట్లా అని నిలదీశారు. ఈ నలుగురిలో  ఇద్దరు టీడీపీ నుంచి వెళ్లిన వాళ్ళేనని ఎద్దేవా చేశారు.  కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు

 • పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు మూడు రాజధానులు కడతారా?
 • పులివెందులలో తాగునీరు ఇవ్వలేని జగన్ రాష్ట్రానికి ఏమి చేస్తాడు?
 • 3 ఏళ్ల జగన్ పాలన పూర్తి వైఫల్యం గా సాగింది
 • 3 ఏళ్లలో జగన్ విద్వంసం…. ప్రజలపై పన్నుల భారం
 • అందరి పై బాదుడే బాదుడు తో మోయలేని భారం
 • ఒంగోలులో మహానాడుకు స్టేడియం ఎందుకు ఇవ్వలేదు….మీ అబ్బ సొత్తు కాదు
 • కడప ఎయిర్ పోర్ట్ దగ్గర కార్యకర్తలపై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టారు.
 • నేను ప్రజాస్వామ్య వాదిని….నేను నాడు అనుకుని ఉంటే జగన్ ఇడుపుల పాయ దాటేవారా?
 • ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది….దీన్ని ఇక ఆపలేరు.
 • జగన్ లాంటి నియంతలకు నేను ఎప్పుడూ భయపడను.
 • 3 ఏళ్ల పాలనలో… కనీసం కడపలో అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టరా?
 • ఒక్క ప్రాజెక్ట్ కట్టారా…ఒక్క పరిశ్రమ తెచ్చారా?
 • బాదుడే బాదుడు నిరసనలు చేస్తున్నా జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు
 • కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ టీడీపీ హయాం లో వచ్చింది.
 • ఆ ప్రాజెక్ట్ విషయం లో నాపై ఆరోపణలు చేసి…ఆ కంపెనీని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ప్రారంభం చేశారు.
 • మూడేళ్ల క్రితం కర్నూల్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యి ఉంటే ఈ రోజు పవర్ కష్టాలు ఉండేవి కాదు.
 • చిరు వ్యాపారులు చిన్న బోర్డ్ పెట్టుకుంటే కూడా పన్నులు వేస్తున్నారు
 • కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వాస్తవాలు చెప్పి ప్రభుత్వ దోపిడీని వివరించాలి
 • అప్పులు 8 లక్షల కోట్ల కు తీసుకు వెళ్ళారు.. అప్పుల్లోను దొంగ లెక్కలు చూపించారు
 • రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు..ఉన్నవాళ్లు వెళ్లి పోతున్నారు.
 • జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చారు.
 • రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు టీడీపీ ఫౌండేషన్ వేసింది…కానీ జగన్ మళ్ళీ పక్కన ఫౌండేషన్ వేసుకున్నాడు.
 • జగన్ ఫౌండేషన్ బదులు…..ప్రారంభం చేసి ఉంటే బాగుండేది.
 • గత ప్రభుత్వం కట్టిన టాయిలెట్స్ కు కూడా రంగులు వేసుకున్న ప్రభుత్వం ఇది
 • సీమకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే
 • జగన్ గండికోట నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇచ్చారా?
 • చిత్రావతి లిఫ్ట్ పనులు పూర్తి చేశారా?

 • జగన్ చెప్పిన రాయలసీమ లిఫ్ట్ ఏమయ్యింది?
 • ఈ ప్రభుత్వం లో ఉద్యోగులకు, పోలీసులకు కనీసం జీతలు కూడ రావడం లేదు.
 • ప్రజల్లో తీవ్ర బాధ, అవేదన ఉంది…గుంటూరు మహిళ వెంకాయమ్మ ప్రభుత్వం తీరును తేల్చి చెప్పింది.
 • అలాంటి ఆమె ఇంటికి వెళ్ళి దాడి చేశారు.
 • అన్నమయ్య ప్రాజెక్ట్ సరిగా నిర్వహించని కారణం గా ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది.
 • ప్రాజెక్ట్ కొట్టుకు పోవడం తో మూడు ఊళ్లలో ఇళ్లు దెబ్బతిన్నాయి..
 • కొట్టుకు పోయిన మూడు ఊళ్లలో ఇళ్ళు కట్టలేని జగన్….రాష్ట్రం లో 30 లక్షల ఇళ్లు కడతారా?
 • పంటల ఇన్స్యూరెన్స్  ఏమయ్యింది? పులివెందులలో రైతులకు ఇన్స్యూరెన్స్ ఎందుకు రావడం లేదు?
 • రాయలసీమ నీటి ఎద్దడికి మైక్రో ఇరిగేషన్ తీస్తే దాన్ని నిర్వీర్యం చేశారు.
 • బైక్ పై మృతదేహాన్ని తరలిస్తే సీఎం కనీసం స్పందించారా?
 • అత్యాచార బాధితులను కనీసం పరామర్శించారా?

అంటూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ పర్యటనలో పెద్దఎత్తున కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.

Also Readజగన్ కు విజయసాయి, కృష్ణయ్య కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com