Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఆసియా కప్ బ్యాడ్మింటన్: డబుల్స్ లో రెండు విజయాలు

ఆసియా కప్ బ్యాడ్మింటన్: డబుల్స్ లో రెండు విజయాలు

Badminton Asia:  ఫిలిప్పీన్స్ లోని మనీలాలో జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ తొలిరోజు భారత్ కు డబుల్స్ విభాగంలో రెండు విజయాలు లభించగా, మూడు జోడీలు ఓటమి పాలయ్యాయి.

పురుషుల డబుల్స్ లో

సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి – చిరాగ్ శెట్టి ద్వయం 21-13;21-19 తేడాతో థాయ్ లాండ్ ఆటగాళ్ళపై విజయం సాధించారు

కృష్ణ ప్రసాద్ గరగ- పంజాల విష్ణువర్ధన్ గౌడ్ జంట- కొరియాకు చెందిన ఆటగాళ్ళ చేతిలో 21-10; 19-21; 21-16 తేడాతో ఓటమి పాలయ్యారు.

ఎమ్మార్ అర్జున్ – ధృవ్ కపిల జోడీ 21-16, 24-22 తేడాతో ఇండోనేషియా జంట చేతిలో ఓటమి పాలయ్యారు

మిక్స్డ్ డబుల్స్ లో

ఇషాన్ భట్నాగర్ – తానీషా క్రాస్టో జోడీ 21-15;21-17తేడాతో హాంగ్ కాంగ్ చైనా కు చెందిన క్రీడాకారులపై విజయం సాధించారు.

వెంకట్ గౌరవ్ ప్రసాద్- జుహీ దేవాంగన్ 21-9; 21-13 తేడాతో ఇండోనేషియా జోడీ చేతిలో పరాజయం పాలయ్యారు.

భారత స్టార్ ఆటగాళ్ళు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ఆకర్షి కాశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్ రేపు బుధవారం తొలి రౌండ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్