Sunday, January 19, 2025
HomeTrending Newsబస్సుకు నిప్పంటించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు

బస్సుకు నిప్పంటించిన ఇస్లామిక్ ఉగ్రవాదులు

మాలి దేశంలో ఉగ్రవాదుల దాడిలో సుమారు 40 మంది అమాయకులు మృత్యువాత పడ్డారు. మరో పదిమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మోప్తి ప్రాంతంలోని బందిగర  – సేవరే మధ్యలొని సొంఘో గరే  పట్టణానికి దగ్గరలో ఇస్లామిక్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆపి ముందుగా డ్రైవర్ ను కాల్చేసిన టెర్రరిస్టులు ప్రయాణికులతో ఉన్న బస్సుకు నిప్పంటించారు. దీంతో అనేక మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు తామే పాల్పడ్డామని త్వరేగ్ ఉగ్రవాదులు ప్రకటించుకోగా ప్రభుత్వం నుంచి ఏ ప్రకటన వెలువడలేదు.

సొంఘో గారే వంతెనపై  ఉగ్రవాదులు చాలా తరచుగా దాడులకు పాల్పడుతున్నారు. కీలకమైన ఈ వంతెన స్వాధీనంలోకి తీసుకుంటే మాలి దేశానికి ఆ దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపొతాయి. త్వరేగ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు 2012 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడుతున్నారు. మతోన్మాదులైన వీరు లిబియా మాజీ అధ్యక్షుడు గడాఫీ అనుకూలురుగా పేరుంది. దేశంలోని ఉత్తర ప్రాంతంలోని అనేక పట్టణాలు, గ్రామాలు త్వరేగ్ ఉగ్రవాదుల చేతుల్లో ఉన్నాయి.

స్వతంత్ర ప్రతిపత్తి కోసం కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఇస్లామీకరణ కోసం జిహాది మూకలు, స్థానిక తేగల మధ్య కుమ్ములాటలతో మాలి దేశం ఆర్ధికంగా చితికిపోయింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు, ఫ్రెంచ్ బలగాలు ఉమ్మడిగా కృషి చేస్తున్నా హింస అదుపులోకి రావటం లేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్