Sunday, January 19, 2025
HomeTrending Newsడమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం

డమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణుల వర్షం

సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణులతో విరుచుపడింది. ఈ రోజు ఉదయం డమాస్కస్‌లోని నివాస భావనాలపై క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో 15 మంది పౌరులు మరణించారు. పలువురు గాయపడ్డారు. సిరియా కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12.30 గంటలకు భారీ శబ్దాలు వినిపించాయని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రెండు వారాల క్రితం ఇదే రీజియన్‌లో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి భారీగా ప్రజలు మరణించగా, తాజాగా ఇజ్రాయెల్‌ దాడుల్లో మరికొంత మంది మృతిచెందారు.

ఇటీవల కాలంలో సిరియాపై ఇజ్రాయెల్‌ వరుస దాడులకు పాల్పడుతున్నది. సిరియా రాజధాని డమస్కస్ లో ఇరాన్‌ మిలిటెంట్లు, లేబానీస్ ఉగ్రవాదులు కొద్దిరోజులుగా ఇజ్రాయిల్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీరిని కట్టడి చేసేందుకు ఇజ్రాయిల్ దాడులకు దిగింది. క్షిపణుల వర్షం కురిపించారని, అయితే అవి నివాస సముదాయాలపై పడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో సాధారణ పౌరులు మరణించారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్