Saturday, November 23, 2024
HomeTrending NewsChandrayan: చంద్రయాన్‌ విజయవంతం కోసం పూజలు

Chandrayan: చంద్రయాన్‌ విజయవంతం కోసం పూజలు

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 ఈరోజు సాయంత్రమే (ఆగస్ట్ 23) చంద్రుడి మీద ల్యాండ్ కాబోతోంది. జులై 14 మద్యాహ్నం 2:35 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నింగికెగిసిన స్పేస్‌క్రాఫ్ట్ 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా 70 డిగ్రీల అక్షాంశం దగ్గర సురక్షితంగా ల్యాండ్ కాబోతోంది.

జాబిల్లిపై చంద్రయాన్‌ అడుగుపెట్టడానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉండటంతో దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. చంద్రుడిపై విక్రమ్‌ విజయవంతంగా అడుగుపెట్టాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలలో పూజలు, ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా, వారణాసిలలో పలువురు భక్తులు సంప్రదాయంగా హవనాన్ని నిర్వహించారు.

లక్నోలోని ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ముంబైలోని శివ మందిరంలో పెద్దయెత్తున హవనం నిర్వహించారు. చంద్రయాన్‌ విజయవంతం కావాలంటూ పలు దేవాలయాలలో భక్తులు అభిషేకాలు, పూజలు జరిపించారు.

చంద్రయాన్ 2 ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, చంద్రయాన్-3ని మరింత సమర్థంగా తీర్చిదిద్దామని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ల్యాండర్ మాడ్యూల్‌ను సక్సెస్ బేస్డ్‌గా డిజైన్ చేశామని.. కానీ చంద్రయాన్-3ని మాత్రం ఫెయిల్యూర్ బేస్డ్ అనాలసిస్‌తో రూపొందించామని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్