Sunday, January 19, 2025
HomeTrending NewsISRO: నింగిలోకి ఆదిత్య ఎల్ -1

ISRO: నింగిలోకి ఆదిత్య ఎల్ -1

అన్నమయ్య జిల్లా శ్రీహరికోట షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా 11.50 గంటలకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ ప్రయోగం జరిగింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ-57 రాకెట్ దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు 235 కి.మీ దూరం నింగిలోకి ప్రయాణించిన అనంతరం భూ స్థిర కక్ష్యలోకి ఆదిత్యా ఎల్-1 శాటిలైట్‌ని పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ప్రవేశపెట్టనుంది.

మిషన్ ఆదిత్య ప్రయోగానికి సుమారు రూ.378 కోట్లు ఇస్రో వెచ్చించింది. షార్‌లో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. మిషన్ ఆదిత్య విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి ధీమాతో ఉన్నారు. పీఎస్ఎల్‌వీ సీ-57 సైతం దిగ్విజయంగా నింగిలోకి దూసుకువెళుతోంది.

రెండో దశ దాటుకొని ఆదిత్య ఎల్ -1 విజయవంతగా సాగుతోంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని విశేషాలను ఆదిత్య వెల్లడించనుంది. నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుందని ఇస్రో వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. 125 రోజుల పాటు ప్రయాణం కొనసాగిస్తుందని.. సూర్యుడి వివరాలు వెల్లడించే ఆదిత్య ఎల్ -1 ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఐదేళ్ళ పాటు సూర్యుడిపై ఆదిత్య పరిశోధనలు కొనసాగిస్తున్దన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్