-2.4 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Homeసినిమా'స్పై'ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్: ఐశ్వర్య మీనన్

‘స్పై’ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్: ఐశ్వర్య మీనన్

నిఖిల్ మరో నేషనల్ థ్రిల్లర్ ‘స్పై‘ తో వస్తున్నారు. గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజశేఖ‌ర్ రెడ్డి భారీ స్థాయిలో  నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జూన్ 29న ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ విలేకరుల సమావేశంలో ‘స్పై’ విశేషాలని పంచుకున్నారు.

ఇది నా మొదటి తెలుగు సినిమా. నిజంగా డ్రీమ్ డెబ్యు. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ సినిమా సైన్ చేసినపుడే నన్ను హీరోయిన్ గా అనుకున్నారు. నేరుగా వచ్చి కథ చెప్పారు. కథ విని చాలా థ్రిల్ అయ్యాను.  ఇందులో నాది చాలా ఇంటెన్స్ రోల్. మరో ఆలోచన లేకుండా సైన్ చేశాను. స్పై .. ఎక్సయిటింగ్ యాక్షన్ థ్రిల్లర్. అందరికీ నచ్చుతుంది.ఇందులో నా పాత్రకు చాలా కోణాలు వుంటాయి. యాక్షన్, స్టంట్స్ అన్నీ వుంటాయి. రా ఏజెంట్ గా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. యాక్షన్,  గన్ షూటింగ్ లో దాదాపు ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. నిజంగా ఇది చాలా ఎక్సైటింగ్ జర్నీ.ఈ పాత్ర  చేసే క్రమంలో ‘రా’ గురించి చాలా నేర్చుకున్నాను. ఎలాంటి గుర్తింపుని ఆశించకుండా దేశానికి సేవ చేస్తుంటారు. అలాగే ఈ సినిమా యాక్షన్ విషయంలో నాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది. ఇకపై యాక్షన్ పాత్రలు వస్తే చాలా కాన్ఫిడెంట్  గా  చేస్తాననే నమ్మకం వుంది. స్పై కి పార్ట్ 2 చేసే స్కోప్ వుంది. ఒకవేళ అది జరిగితే అందులోనూ నేనే హీరోయిన్ గా ఉండాలనేది నా కోరిక.

Also Read: నిఖిల్ స్పై ట్రైలర్ రిలీజ్..

RELATED ARTICLES

Most Popular

న్యూస్