ఆఫ్రికా దేశాల నుంచి బతుకు దెరువు కోసం వెళ్ళే వలస జీవుల పడవ మధ్యదార సముద్రంలో బోల్తా పడింది. గ్రీస్ దేశం సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వలసదారులతో వెళ్తున్న చేపల పడవ (చిన్నపాటి నౌకలాంటిది) నీట మునగడంతో దాదాపు 79 మంది మరణించారు. డజన్ల కొద్ది జనం తప్పిపోయారు. దక్షిణ గ్రీస్ తీర ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఐక్యరాజ్య సమితి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Illegal Migrants: వలస జీవుల పడవ మునిగి 79 మంది మృతి
చేపల వేట కోసం వెళ్తున్న పడవలో సామర్థ్యానికి మించి వలసదారులు ఎక్కారు. అయితే ఈ పడవ కొద్దిదూరం ప్రయాణించాక అదుపుతప్పి నీట మునిగిపోయింది. దీంతో 78 మంది ప్రాణాలుకోల్పోయారు. 104 మందిని రక్షించారు. తప్పిపోయినవారిని కాపాడటానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు, గల్ఫ్ దేశాల్లో అధికారం కోసం పోరాటాలతో సామాన్యుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి. ఇదే అదునుగా అక్రమ వలసలు ప్రోత్సహించే దిశగా కొన్ని ఏజెన్సీలు తాప్పుడు పత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నాయి. మధ్యధార సముద్రంలో అక్రమంగా వలస వెళ్ళే వారి పడవలు బోల్తా పడటం సాధారణంగా మారింది.