Friday, September 20, 2024
HomeTrending NewsBHARAT: ‘ఇండియా’కు బదులు ‘భారత్’గా మార్చేందుకు కసరత్తు

BHARAT: ‘ఇండియా’కు బదులు ‘భారత్’గా మార్చేందుకు కసరత్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అమలు చేసే దిశగా ముందుకు వెళుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా రాష్ట్రపతి భవన్ జీ20 దేశాధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొంది. అదే విధంగా విదేశీ ప్రతినిధులకు మన దేశ అధికారులకు ఓ పుస్తకాన్ని అందజేశారు. ఈ పుస్తకం శీర్షిక ‘‘భారత్, ది మదర్ ఆఫ్ డెమొక్రసీ’’.  ఈ పుస్తకం ప్రారంభంలో ‘‘భారత్‌లో అంటే ఇండియాలో రికార్డయిన ప్రాచీన చరిత్ర నుంచి పాలనలో ప్రజల సమ్మతిని తీసుకోవడం జీవనంలో ఓ భాగం’’ అని రాశారు.

ఈ పరిణామాలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇండియా వర్సెస్ భారత్ అనే చర్చ ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పటి నుంచి తీవ్ర స్థాయికి చేరింది.

ఈ నెల 18-22 మధ్యలో  స్పెషల్​ సెషన్​ జరగనుంది. ఇండియా పేరును ‘భారత్​’గా మార్చాలని కేంద్రం నిర్ణయించుకుందని, ఈ ప్రత్యేక సమావేశంలో.. అందుకు కావాల్సిన రాజ్యాంగ సవరణలను చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుందని రూమర్స్​ వస్తున్నాయి.

 2022 ఆగస్ట్​ 15న, ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం చేసిన ప్రసంగంలో.. ఇండియా పేరు మార్చాలని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఇండియా పేరును భారత్​గా మార్చాలన్న అంశానికి చాలా మంది మద్దతిస్తున్నారు. భారత్​ అనేది దేశ గౌరవానికి చిహ్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్