Thursday, April 18, 2024
HomeTrending Newsఓవరాల్ గా మంచి బడ్జెట్: బుగ్గన

ఓవరాల్ గా మంచి బడ్జెట్: బుగ్గన

కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్ను పరిమితిని ఏడు లక్షల రూపాయలకు పెంచడం పట్ల రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హర్షం వ్యక్తం చేశారు.  ఇది ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనకరమని, శ్లాబులను తగ్గించి మేలు చేశారని అన్నారు. మొత్తానికి చూస్తే ఇదో మంచి బడ్జెట్ అని అభివర్ణించారు. కోవిడ్ నుంచి కోలుకుంటున్న దశలో ఈ బడ్జెట్ ను పార్టీలకు అతీతంగా అందరూ ఆహ్వానించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నేడు పార్లమెంట్ లో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై బుగ్గన స్పందించారు. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు చేశారనేది పూర్తి బడ్జెట్ చూసిన తర్వాతే తెలుస్తుందన్నారు.

ప్రీ బడ్జెట్ సమావేశాల్లో తాము కోరిన పలు అంశాలకు కేటాయింపులు చేశారని బుగ్గన చెప్పారు. పంప్డ్ విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చారన్నారు. అర్బన్ లోకల్ బాడీస్ లో చేపట్టే పలు ప్రాజెక్టులకు వయబిలిటీ  ఫండ్ గ్యాప్ కోసం పది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం ముదావహమన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కు కూడా 60శాతం పైగా కేటాయింపులు పెంచారన్నారు. ఫిష్ మీల్, ప్రాన్స్ మీల్ మేతపై ఇంపోర్ట్ డ్యూటీ కూడా తమ విజ్ఞప్తి మేరకు తగ్గించారని బుగ్గన వివరించారు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, స్కిల్ ఇంటర్నేషనల్ సెంటర్ ల ఏర్పాటును ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

విద్య, వైద్య, విద్యుత్ రంగాలకు, జల్ జీవన్ కు కేటాయింపులు పెంచారని,  ఉపాధి హామీ పథకం, ఎరువుల సబ్సిడీ, వ్యవసాయ రంగానికి  కేటాయింపులు తగ్గించారని బుగ్గన వెల్లడించారు. రవాణా రంగానికి భారీ కేటాయింపులు చేశారన్నారు.  ఫిస్కల్ డెఫిసిట్ 6.4 నుండి 5.9 శాతానికి తగ్గడం మంచి పరిణామమన్నారు. పన్ను ఆదాయం గతంలో 30.43 కోట్లు ఉండగా 33.60 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందన్నారు.  రాష్ట్రం వాటా 9.17 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ తమ ప్రభుత్వం విధానమని, దీనిలో భాగంగానే సిఎం జగన్ నిన్నటి వ్యాఖ్యాలు ఉన్నాయని చెప్పారు. సిఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుందని బుగ్గన తేల్చి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్