మన దేశంలో వాక్సినేషన్ రెండు మూడు నెలల్లో పూర్తి కావడం అసాధ్యమని సీరం సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండవ స్థానంలో ఉన్నామని, అలాంటి దేశంలో అర్హులైన అందరికి వాక్సిన్ వేయడానికి నెలల తరబడి సమయం పడుతుందని వెల్లడించింది. కోవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం సంస్థ సి ఈ ఓ అధర్ పునావాలా నేడు ఓ సుదీర్ఘ ప్రకటన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు.
ఇండియాకు ఇవ్వకుండా వాక్సిన్లు విదేశాలకు ఎగుమతి చేశారంటూ వస్తున్న ఆరోపణలను సంస్థ ఖండించింది. కేంద్రం చేపడుతున్న వాక్సిన్ కార్యక్రమానికి సహకారం అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.
ప్రపంచంలో వాక్సిన్ పూర్తి కావడానికి కనీసం మూడేళ్ళు పడుతుందని సీరం పేర్కొంది. దీని వెనుక అనేక అంశాలు, సవాళ్లు కూడా ఉన్నాయని తెలిపింది.