Saturday, January 18, 2025
HomeTrending Newsఅది టిడిపి కార్యకర్తల పాదయాత్ర: బొత్స

అది టిడిపి కార్యకర్తల పాదయాత్ర: బొత్స

It Is Padayatra Of Tdp Workers Minister Botsa On Amaravathi Jac Padayatra :

బిజెపితో పొత్తులో ఉంటూ పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడం హాస్యాస్పదమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్ కు ఓ రాజకీయ సిద్ధాంతం అంటూ ఏమీ లేదని వ్యాఖ్యానించారు.  రాజధాని రైతుల పాదయాత్ర అంటే టిడిపి కార్యకర్తల పాదయాత్ర అని బొత్స అభివర్ణించారు. ఆ యాత్రలో టిడిపి కార్యకర్తలు మాత్రమే ఉన్నారని, రాష్ట్ర వినాశనానికి టిడిపి ప్రయత్నాలు  చేస్తోందంటూ బొత్స మండిపడ్డారు.

కాగా, రైతులకు అణాపైసల వరకు చెల్లిస్తామని బొత్స స్పష్టం చేశారు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీపై బొత్స సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న రైతుల వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దాదాపు 80 వేల ఎకరాల్లో సాగుచేసిన చెరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు చెల్లించాల్సింది కేవలం రూ.6 కోట్లేనని తెలిపారు.

ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రెండు క్రషింగ్‌ సీజన్‌లకు సంబంధించిన రూ.16.33 కోట్ల బకాయిలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం రైతులకు చెల్లించడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కనిపించలేదు. దీంతో విసుగెత్తిన రైతులంతా పోరాటానికి దిగారు. రైతులకు వామపక్షపార్టీలు, జనసేన పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించారు.

Must Read :అమరావతి ‘మహా పాదయాత్ర’ ప్రారంభం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్