8.6 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending Newsఅమరావతి ‘మహా పాదయాత్ర’ ప్రారంభం

అమరావతి ‘మహా పాదయాత్ర’ ప్రారంభం

Amaravathi Jac Maha Padayatra Started :

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపడుతోన్న మహా పాదయాత్ర నేడు ప్రారంభమైంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ‘న్యాయస్థానం – దేవస్థానం’ మహా పాదయాత్ర పేరుతో నేటి (నవంబర్ 1)నుంచి డిసెంబర్ 17 వరకూ… తుళ్లూరు హైకోర్టు నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు ఈ యాత్ర సాగనుంది.

రోజుకు 14 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ పాదయాత్ర నేడు మొదటిరోజు తుళ్లూరు నుంచి పరిమి మీదుగా తాడికొండకు చేరుకోనుంది.  గుంటూరు జిల్లాలో 6 రోజులపాటు యాత్ర కొనసాగనుంది.

ఈ పాదయాత్రకు అధికార వైఎస్సార్సీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. మాజీ పోలీసు అధికారి వివి లక్ష్మి నారాయణ కూడా ఈ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. మొదటి రోజు యాత్రలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, గద్దె అనురాధ,  తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు శివాలయంలో పూజలు నిర్వహించి ఈ యాత్రను ప్రారంభించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలు పెద్దఎత్తున ఈ యాత్రలో పాల్గొంటున్నారు.

Must Read :అమరావతి యాత్రకు హైకోర్టు ఓకే

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్