Saturday, April 20, 2024
Homeసినిమా'ఆర్ఆర్ఆర్' నామినేట్ చేయకపోవడం అన్యాయం: కాశీ విశ్వనాథ్

‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ చేయకపోవడం అన్యాయం: కాశీ విశ్వనాథ్

‘ఆర్ఆర్ఆర్’ ని ఆస్కార్ కి నామినేట్ చేయకపోవడం అన్యాయమని సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు, సినీ నటుడు వై. కాశీ విశ్వనాథ్ అన్నారు. ఒక దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో.. కల్పిత కధతో ఎంతో కష్టపడి.. ఎన్నో సంవత్సరాలు వెచ్చించి.. అద్భుతంగా తెరకెక్కించిన సినిమా.. “ఆర్ఆర్ఆర్”. ‘కంటెంట్’ పరంగా గానీ… ‘సందేశం’ పరంగా గానీ దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా అని అన్నారు.

సినిమా చిత్రీకరణలో ‘సీన్స్’ రక్తి కట్టించడంలో గాని.. నటీనటుల పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని.. దర్శకులు రాజమౌళి గారు ప్రాణం పెట్టి పని చేశారు. హీరోలు జూ. ఎన్టీఆర్ గారు గానీ.. రామ్ చరణ్ గారు ఆ పాత్రల్లో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయకుండా.. ” చెల్లో షో” అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం.. తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం.. శోచనీయం. దీన్ని ఖండిస్తూ.. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా..  నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను అన్నారు.

Also Read ఆస్కార్ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది: శంకర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్