ఈటల రాజేందర్ తో భేటిపై సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. రాజేందర్ స్వయంగా వచ్చి కలిశారని, కలవాలని తాను అడగలేదని స్పష్టం చేశారు. రాజేందర్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే విషయం తన పరిధిలోకి రాదనీ, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఏడు సంవత్సరాలుగా కెసియార్ పరిపాలనపై పోరాడుతూనే ఉన్నామని, ఇప్పడు రాజేందర్ కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు. అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి పోరాడడంలో తప్పేంటి అంటూ భట్టి ప్రశ్నించారు.
ఈటల గత నాలుగైదు రోజులుగా పలు పార్టీల నేతలను కలుసుకుంటున్నారు. నిన్న సిఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుసుకున్నారు. భట్టి ఈటలను కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై భట్టి నేడు వివరణ ఇచ్చారు.