Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్‘రాంకీ’ పై ఐటి దాడులు

‘రాంకీ’ పై ఐటి దాడులు

గచ్చిబౌలి లోని రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  రాంకీ అనుబంధ సంస్థల్లో సైతం మొత్తం 15 బృందాలతో వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.  కంపెనీ జరిపిన అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల మధ్య తేడాలున్నట్టు ఐటి అధికారులు గుర్తించారు.  కంపెనీ చెల్లించిన అడ్వాన్స్ టాక్స్ వివరాలను కూడా అధికారులు పరిశీలించినట్టు సమాచారం. డిప్యూటీ మేనేజర్ స్థాయి అధికారి సమక్షంలో ఐటి అధికారుల బృందం రికార్డులు, ఖాతా పద్దులను పరిశీలిస్తున్నారు.

రాంకీ కంపెనీ అధినేత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాంకీ గ్రూప్ లో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల వివిధ ప్రాజెక్టులు చేపట్టాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్