Friday, March 29, 2024
Homeఅంతర్జాతీయంచైనా డబ్బులు చైనాలోనే ఉండాలట!

చైనా డబ్బులు చైనాలోనే ఉండాలట!

చైనా ప్రభుత్వం వెంటపడితే ఎలా ఉంటుందో ప్రపంచ కుబేరుల్లో ఒకడయిన ఆలీబాబా కంపెని అధినేత జాక్ మా ఉదంతమే ప్రపంచానికి ఇటీవలి ఉదాహరణ. అంతర్జాతీయ వాణిజ్య వేదికల మీద స్ఫూర్తిదాయక ఉపన్యాసాలిచ్చే ఆయన దాదాపు ఆరు నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. విదేశాల్లో ఆయన పెట్టుబడుల మీద చైనా ప్రభుత్వం విజయవంతంగా అనుమానాలను రేకెత్తించగలిగింది. చైనాలో అత్యంత సంపన్నుడయిన జాక్ మా చివరికి తన కంపెని బతికి బట్ట కట్టగలిగితే చాలు అనుకునేలా చేశారు.

తాజాగా అమెరికా స్టాక్ ఎక్స్ చేంజ్ లో పబ్లిక్ ఇష్యుకు వెళ్లి నలభై వేల కోట్ల రూపాయలు సమీకరించుకోవాలనుకున్న ఫుల్ ట్రక్ కంపెనీపై చైనా ప్రభుత్వం కన్ను పడింది. మనదేశంలో లింక్డ్ ఇన్ లా చైనాలో బాస్ జిపిన్ అతిపెద్ద ఉద్యోగ నియామకాల యాప్. బాస్ జిపిన్ విజయవంతం కావడంతో ఈ కంపెని మిగతా రంగాలకు కూడా తన ఆన్ లైన్ సేవలను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అతి పెద్ద లోడ్ లను మోసుకెళ్ళే లారీలను ట్రాక్ చేసే యాప్ ను ఆవిష్కరించింది.

ఫుల్ ట్రక్ అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడం చైనా ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో చైనా పారిశ్రామిక దిగ్గజాలకు గట్టి హెచ్చరిక ఇవ్వాలనుకుంది. ముందు సొంత దేశంలో ఇంటిని చక్కబెట్టుకోకుండా, అంతో ఇంతో ఇక్కడ సంపాదించి, అ డబ్బులు తీసుకెళ్ళి విదేశాల్లో పెడతారా? అంటూ కత్తి ఝలిపిస్తోంది. ఏదేశంలో అయినా సి బి ఐ, ఈ డి లాంటివి ఉండనే ఉంటాయి. చైనాలో కుడా ఉన్నాయి. ఈ దెబ్బతో అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్లాలనుకుంటున్న మిగతా చైనా కంపెనీలు వణికిపోతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్