Saturday, January 18, 2025
HomeTrending Newsఅన్ని విషయాలు వెల్లడిస్తా - ఈటల

అన్ని విషయాలు వెల్లడిస్తా – ఈటల

ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో నన్ను కుడి భుజం.తమ్ముడు అని రైతు బందు పథకాన్ని హుజురాబాద్ లో ఆవిష్కరించిన మాట వాస్తవమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 2018 ఎన్నికల్లో వెయ్యి కోట్లు సంపాదించాడని నా మీద పోస్టర్లు,కరపత్రాలు వేశారు. అయితే నేను పదవుల్లో ఉన్ననాడు ఎవరి మీద కేసులు పెట్టలేదు నా మీద కరపత్రాలు పంచిన వ్యక్తి వేరే వాళ్ళను బ్లాక్ మేయిల్ చేస్తే ఆ వ్యక్తి పై కేసులు నమోదయ్యాయన్నారు. కేసీఆర్ అఫీస్ నుండి చెప్తేనే నేను కరపత్రాలు పంచానని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు.

నన్ను ఓడగొట్టమని నా ప్రత్యర్థి కి డబ్బులు పంపినా నేను ఆ బాధను దిగమింగుకున్నానని ఈటల రాజేందర్ వెల్లడించారు. గత పద్దెనిమిది ఏళ్ళుగా నేను ఉద్యమం లో పాల్గొనలేదా,ఇప్పుడు నియోజక వర్గం లో తిరుగుతున్న మంత్రుల  మీద ఉన్నాయా కేసులు నా మీద ఉన్నాయా అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని వెన్నంటే ఉన్న వాళ్ళను దూరం పెట్టిన కెసిఆర్ తిట్టినోల్లను దగ్గర పెట్టుకున్నాడని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎం జరిగిందో తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తానని ఈటల చెప్పారు.

ఒక మంత్రి అంటున్నాడు చీమలు పెట్టిన పుట్టలో నేను చేరిన అని, ఎవరు పెట్టినా పుట్టలో ఎవరు చెరారో ప్రజలందరికీ తెలుసని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వాహనాల మీద నా స్టిక్కర్ ఉన్నవాళ్లు నాతో పాటు ఉండే వాళ్ళను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నియోజక వర్గంలో వ్యాపారాలు నడుపుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీ లో ఉండాలని బెదిరిస్తున్నారని, డబ్బులు, కుల సంఘాల భవననాలు, పెన్షన్ లు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారో ఆలోచన చేయండని ఈటల రాజేందర్ ప్రజలను కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్