Sunday, January 19, 2025
HomeసినిమాRavanasura: గ్రేట్ ఎక్స్ పీరియన్స్: హర్షవర్థన్ రామేశ్వర్

Ravanasura: గ్రేట్ ఎక్స్ పీరియన్స్: హర్షవర్థన్ రామేశ్వర్

రవితేజ, సుశాంత్ కాంబినేషన్లో వస్తున్న క్రైమ్ యాక్షన్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌ పై అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా ‘రావణాసుర’ గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మీడియాతో చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

“అభిషేక్ గారి ప్రొడక్షన్ లో ‘డెవిల్’ సినిమా చేస్తున్నాను. అభిషేక్ గారు ఒక రోజు కాల్ చేసి రావణాసుర టైటిల్ ఎలా వుందని అడిగారు. చాలా పవర్ ఫుల్ టైటిల్ అని చెప్పాను. దీనికి థీమ్ సాంగ్ కావాలని కొన్ని వివరాలు చెప్పారు. ఒక ట్యూన్ చేసి పంపించాను. కొన్ని రోజులు తర్వాత ఒక రోజు స్టూడియోకి అభిషేక్ గారు, సుధీర్ వర్మ గారు వచ్చారు. ‘రావణాసుర’కి నువ్వే మ్యూజిక్ చేస్తున్నావని చెప్పారు. నాకు చాలా సర్ప్రైజ్ అనిపించింది. వెంటనే మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇందులో రవితేజ గారు హీరో అని చెప్పారు. నా మైండ్ బ్లాంక్ అయిపొయింది. రవితేజ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాకి పని చేయడం డ్రీమ్ కం ట్రూ మూమెంట్”

Ravanasura Movie Trailer Release

“నేను రావణాసురలో నాలుగు పాటలు తో పాటు నేపధ్య సంగీతం చేశాను. భీమ్స్ గారు ఒక ఐటెం సాంగ్ చేశారు. సినిమా మొత్తం స్పెషల్ గా వుంటుంది. సుధీర్ వర్మగా డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సౌండింగ్ కొత్తగా వుండాలని ఎదురుచూస్తారు. సాంగ్స్, నేపధ్య సంగీతం చాలా కొత్తగా చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు. రవితేజ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయన ఇచ్చే సలహాలు సూచనలు చాలా ఇన్నోవేటివ్ గా వుంటాయి”

“వెయ్యినొక్క జిల్లాల వరకు సాంగ్ రీమిక్స్ చేసినప్పుడు ఒక చోట స్ట్రింగ్ వాయిద్యం వాడాను. రవితేజ గారు అక్కడ విజల్ సౌండ్ వాడితే బావుంటుందని చెప్పారు. నిజంగా అది చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది. సినిమా థీమ్ గ్లింప్స్ లో కూడా విజల్ వుంటుంది. అలా అది గొప్పగా కనెక్ట్ అయ్యింది. సుధీర్ వర్మ గారు సౌండ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా వుంటారు. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా అడుగుతారు. దీంతో డిఫరెంట్ గా చేసే స్కోప్ దొరికింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. అన్ని జోనర్స్ కి పని చేయాలని వుంటుంది. సంగీతానికి స్కోప్ వుండి, డిఫరెంట్ గా మ్యూజిక్ చేసే అవకాశం వున్న సినిమాలు చేయాలని వుంటుంది. కళ్యాణ్ రామ్ గారి డెవిల్, సందీప్ గారి యానిమల్ సినిమాలకి పని చేస్తున్నాను” అంటూ విశేషాలు తెలియజేశారు.

Also Read : ‘రావణాసుర’ ట్రైలర్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్