Tuesday, June 16, 2026
Homeసినిమాసందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ సింగిల్ విడుదల

సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ సింగిల్ విడుదల

హీరో సందీప్ కిషన్, టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఫాంటసీ అడ్వంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌ పై రాజేష్ దండా నిర్మిస్తునారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై అనిల్ సుంకర  సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా  సహ నిర్మాత. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా  విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌.. ఈ సినిమా కోసం ఒక ఫాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేశారని సూచించింది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సౌండ్‌ట్రాక్‌లను అందించారు.

సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ పై బ్రీజీ రొమాంటిక్ నంబర్‌ను కంపోజ్ చేశారు శేఖర్ చంద్ర. సిద్ శ్రీరామ్ తన మ్యాజికల్ వాయిస్ తో మరింత ప్రత్యేకంగా, మంత్రముగ్ధులను చేశాడు. ఇన్స్టెంట్ హిట్‌గా మారిన ఈ ఆహ్లాదకరమైన పాటలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మపై తన భావాలను వివరిస్తూ కనిపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. సందీప్ కిషన్ డ్యాన్స్‌లు గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. వర్ష బొల్లమ్మ చాలా అందంగా కనిపించింది. కావ్య థాపర్ మరో కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, ఎ రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular