Tuesday, June 16, 2026
Homeసినిమాదసరా ఫస్ట్ డే కలెక్షన్ 38 కోట్లు

దసరా ఫస్ట్ డే కలెక్షన్ 38 కోట్లు

నేచురల్ స్టార్ నాని, మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం దసరా. ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో దసరా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే దసరా చిత్రానికి ఫస్ట్ డే భారీగా ఓపెనింగ్ వచ్చింది. అన్ని ఏరియాల్లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంకా చెప్పాలంటే.. అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. దసరా చిత్రం ఫస్ట్ డే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 38 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇది నాని కెరీర్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ లో హయ్యస్ట్ గా నిలిచింది. ఇక ఓవరీ సీస్ లో ప్రీమియర్ అండ్ ఫస్ట్ డే తో కలిపి 1 మిలియన్ మార్క్ ను అందుకుంది. 2 మిలియన్ దిశగా దూసుకెళుతుంది. నాని, కీర్తి సురేష్‌ నటన, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ అండ్ రైటింగ్, ఎస్ఎల్వి సినిమాస్ నిర్మాణ విలువలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి. అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ రావడం.. లాంగ్ వీకెండ్ కావడం బాగా కలిసొచ్చింది. నానికి ఫస్ట్ 100 కోట్ల మూవీ అవుతుందని టాక్ వినిపిస్తోంది. మరి.. ఫుల్ రన్ లో దసరా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Also Read : Dasara: ఆ ఒక్క బిట్ కోసమైనా ‘దసరా’ చూడొచ్చు! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular