రావణాసుర రన్ టైమ్ ఎంత..?

మాస్ మహారాజా రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. దీంతో రావణాసుర మూవీతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ చిత్రంలో దక్ష నాగర్కర్, అను ఇమ్మానుయేల్, పూజితా పొన్నాడ, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా హీరోయిన్స్ గా తెరకెక్కింది. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించడం విశేషం. ఆర్టి టీమ్ వర్క్స్ తో కలిసి అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

షూటింగ్ బిగినింగ్ నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన రావణాసుర మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై మరింతగా అంచనాలు పెంచేశాయి. ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న రావణాసుర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్  A సర్టిఫికెట్ ని ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్ టైమ్ ఎంతంటే.. మొత్తం 2 గంటల 21 నిమిషాలు అని సమాచారం. మరి.. రావణాసుర మూవీతో రవితేజ హ్యాట్రిక్ సాధిస్తారేమో చూడాలి.

Also Read : Ravanasura: గ్రేట్ ఎక్స్ పీరియన్స్: హర్షవర్థన్ రామేశ్వర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *