Friday, March 6, 2026
HomeTrending Newsటిడిపి చేయిస్తున్న దగా యాత్ర : ధర్మాన

టిడిపి చేయిస్తున్న దగా యాత్ర : ధర్మాన

అమరావతి రైతుల పాదయాత్ర టీడీపీ చేయిస్తున్న దగా యాత్ర అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అభివర్ణించారు. అదో రియల్ ఎస్టేట్ యాత్ర, భ్రమరావతి యాత్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబే అన్నారు. అమరావతి భూములకు బినామీ చంద్రబాబేనని, అదే రీతిలో ఈ ఉద్యమానికి బినామీ కూడా ఆయనేనని మండిపడ్డారు.

అమరావతి రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదని,  రాజకీయ రంగు పులుముకున్న యాత్రకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులే యాత్రలో ఉన్నారని, ఈ యాత్ర చేయిస్తున్నది నేనే అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఒక ఆన్యాయం నుంచి మరిన్ని అన్యాయాలకు దారి తీయాలని చంద్రబాబు చేసే ప్రయత్నాలకు మారుపేరుగా ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.

13 జిల్లాలు, మిగతా ప్రాంతాలు, మిగతా సామాజికవర్గాల వారిని కవ్విస్తూ యాత్ర సాగిస్తున్నారని, ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం,  చివరికి విశాఖపట్టణంలో ఏ ఒక్క నిర్మాణం జరగటానికి వీల్లేదని స్టేలు తీసుకురావటం ఉత్తరాంధ్ర ప్రయోజనాలమీద దండయాత్ర కాదా? అని నిలదీశారు.  అన్ని ప్రాంతాల సమానాభివృద్దికి,  సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారని,  మేనిఫెస్టోలో ఏం చేస్తామని చెప్పారో దాన్ని దైవంగా భావించి చేసి చూపిస్తున్నారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular