Sunday, January 19, 2025
Homeసినిమాఅదే నా చివ‌రి సినిమా: అశ్వ‌నీద‌త్

అదే నా చివ‌రి సినిమా: అశ్వ‌నీద‌త్

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టి ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్ లో  అశ్వ‌నీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ అప్ప‌ట్లో ఊహించిన దాని కంటే అంత‌కు మించి అన్న‌ట్టుగా విజ‌యం సాధించింది. చిరంజీవి కెరీర్ లోనే కాకుండా.. అశ్వ‌నీద‌త్, రాఘ‌వేంద్ర‌రావు కెరీర్ లో కూడా మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ మూవీ త‌ర్వాత నుంచే శ్రీదేవి అంటే అతిలోక సుంద‌రి అనే పేరు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సీక్వెల్ తీయాల‌ని అశ్వ‌నీద‌త్ ఎప్ప‌టి నుంచో ప్లాన్ చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ కాంబినేష‌న్లో ఈ మూవీ తీయాల‌నేది అశ్వ‌నీద‌త్, రాఘ‌వేంద్ర‌రావుల ప్లాన్. గ‌తంలో ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి కానీ.. సెట్ కాలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. అశ్వ‌నీద‌త్ ఇటీవ‌ల ‘సీతారామం’ సినిమాతో స‌క్సెస్ సాధించారు. ఈ సినిమా ఆయనలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా అశ్వ‌నీద‌త్ స్పందిస్తూ… జ‌గ‌దేకవీరుడు అతిలోక‌సుంద‌రి పార్ట్ 2 త‌న జీవితంలో చివ‌రి సినిమా అని.. ఆ సినిమా తీయాల‌నేది త‌న డ్రీమ్ అని చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో పాన్ వ‌ర‌ల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే తీస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో ఈ సినిమా రూపొందుతోంది. అమితాబ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌రి.. ఈ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ తో జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి పార్ట్ 2 స్టార్ట్ చేస్తారేమో చూడాలి.

Also Read :  ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్ కె’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వ‌నీద‌త్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్