Friday, April 19, 2024
Homeసినిమాజిన్నా' ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్

జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్

బాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ తెలుగులో పూర్తి స్థాయిలో న‌టిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఈ చిత్ర యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సన్నీ లియోన్ పాత్ర ఏమిటి, ఆమె ఎలా నటిస్తుందో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంద‌ర్భంలో కొత్త లుక్ సోషల్ మీడియాలో విప‌రీత‌మైన‌ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను రచయిత అయిన‌ కోన వెంకట్ అందించారు. హీరో మంచు విష్ణు స‌ర‌స‌న‌ సన్నీలియోన్ తో పాటు పాయల్ రాజ్‌పుత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. తెలుగు తమిళం, మలయాళం, హిందీ అనే నాలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో విష్ణుతో స‌న్నీ రీల్స్, విష్ణు, ఆయ‌న బృందంతో సన్నీ ఓ చమత్కారమైన రీల్స్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించారు. ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్ మాస్ట‌ర్ ఈ చిత్రానికి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా ప‌ని చేస్తున్నట్లు సమాచారం. త‌న సంగీతంతో తెలుగు ప్రేక్ష‌కుల‌నీ ఉర్రుత‌లూగించే అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్