నందమూరి బాలకృష్ణ,  దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా జతకడుతున్న క్రేజీ కాంబినేషన్ కు సర్వం సిద్ధమైయింది. #NBK108 వర్కింగ్ టైటిల్ తో బాలకృష్ణ పుట్టినరోజున సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈరోజు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులకు సంబధించిన ప్రకటన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.  సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

అనిల్ రావిపూడి, థమన్ కలసిపని చేయడం ఇదే తొలిసారి. కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు థమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా “త్వరలో బాంబార్డింగ్…” అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది. అనౌన్స్ మెంట్ బిజీఎంనే అదిరిపోయిందంటే.. సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు.

Also Read షూటింగ్స్ బంద్ పై బాల‌య్య‌ అసహనం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *