ఆగ‌ష్టు 1 నుంచి షూటింగులు నిలిపివేస్తూ ఫిలిం ఛాంబ‌ర్  నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఎక్క‌డ షూటింగులు అక్క‌డే ఆగిపోయాయి.  దీంతో ఇండ‌స్ట్రీలో ఏం జ‌రుగుతోందనేది గంద‌ర‌గోళంగా మారింది. కొంత మంది షూటింగులు ఆపేయాల‌ని.. కొంత మంది షూటింగులు చేయాల‌ని వాదించుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న వార‌సుడు షూటింగ్ జ‌రుగుతుండ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో రంగంలోకి దిగిన దిల్ రాజు అది త‌మిళ సినిమా అంటూ వివ‌ర‌ణ ఇచ్చారు.

ప్ర‌స్తుతం సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ ల‌లో ఒక్కో రోజు ఒక్కో శాఖ‌తో మీటింగులు పెట్టి ఎలా బ‌డ్జెట్ త‌గ్గించాలి అనేది చ‌ర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌,  మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో ఓ భారీ యాక్ష‌న్ మూవీ చేస్తున్నారు. ఇందులో బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ఈ మూవీ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వ‌స్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే.. షూటింగులు ఆగిపోయి ప‌ది రోజులు అయినా ఇంకా ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో  బాలయ్య అసహనం వ్యక్తం చేస్తూ వెంట‌నే షూటింగ్ స్టార్ట్ చేయ‌మ‌ని నిర్మాత‌ల‌కు చెప్పాడ‌ట‌. దీంతో షూటింగ్స్ బంద్ చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం.. సమస్యల పురస్కారం కోసం ఏవిధంగా ముందుకు వెళ్తున్నారు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే విషయాలను బాలకృష్ణకు వివరించి నచ్చ జెప్పే బాధ్యతను సీనియర్ నిర్మాతల ప్రత్యేక కమిటీకి అప్పగించారట. మ‌రి.. ఈ క‌మిటీ చెప్పింది విని బాల‌య్య‌ ఆగుతారో.. లేక క‌మిటీతో ప‌ని లేద‌ని షూటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *