గొర్రెల పెంపకంతో ఆర్డిక పరిపుష్టి కలుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా ఎగువ రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులు నిలువరించడం సులభతరమౌతుందన్నారు.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నారని ఆయన అన్నారు. వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు గాను ఆయన శుక్రవారం సాయంత్రం సూర్యపేట నియోజకవర్గంలో తుంగతుర్తి, భోనగిరి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి లతో కలసి పర్యటిస్తున్న క్రమంలో చివ్వేంల మండలం ఐలాపురం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను చూసి తన కాన్వాయ్ ని అపి కారు దిగి గొర్రెపిల్లను చేతిలోకి తీసుకుని గొర్రెల కాపరితో కాసేపు ముచ్చటించారు. అనుకోకుండా తారసపడిన ఈ ఉదంతాన్ని ఎదుర్కొన్న గొర్రెల కాపరి అవాక్కయ్యారు.కాసేపటికి తేరుకొని అభివృద్ధి కార్యక్రమాలు అమలు పరుస్తూ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర వేసే మంత్రి జగదీష్ రెడ్డి ఎదురుగా ప్రత్యక్షం కావడం ఒక ఎత్తైతే అమాంతం గొర్రె పిల్లను చేతిలోకి తీసుకొని గొర్రెలలో రకాలు, వాటి పెంపకం విధానం చెబుతుంటే అచ్చెరువొందడం సదరు గొర్రెల కాపరి వంతైంది.వ్యవసాయం అన్నా,ఆవులు,బర్రెలు,గొర్రెల పెంపకం అంటే అమితంగా ఇష్టపడే మంత్రి జగదీష్ రెడ్డి గొర్రెల పెంపకంలో మెళుకవులు చెబుతుంటే గొర్రెల కాపరి అమితాశక్తి తో వినడం ఈ పర్యటన లో హైలెట్ గా నిలిచింది.
TRENDING NEWS
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com