Thursday, June 11, 2026
HomeTrending Newsమళ్ళీ మంచిరోజులు వస్తాయి: జగన్

మళ్ళీ మంచిరోజులు వస్తాయి: జగన్

వైఎస్సార్సీపీ ఓటమితో కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామని… ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉందని, ప్రజలకు మనపట్ల  విశ్వాసం ఉందని, భవిష్యత్‌ మనదేనని భరోసా ఇచ్చారు. మూడు రోజులుగా పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ నేడు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనిదిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు జగన్‌ సూచించారు.

వైఎస్సార్ కడప జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను  జగన్ కలుసుకుని వారినుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.. అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి మృతదేహానికి జగన్ దంపతులు నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మూడు రోజులపాటు పర్యటించిన జగన్ సోమవారం మధ్యాహ్నాం తన పర్యటన ముగించుకుని సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular