Thursday, March 28, 2024
HomeTrending Newsఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్

ఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్

Work Hard: రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని, వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా తాను చేయాల్సిందంతా చేస్తున్నానని, ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని సూచించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో జరిగిన వర్క్‌ షాప్‌ లో సిఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చామని, ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద వీటిని కేటాయిస్తున్నామని,  సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనమని వివరించారు. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను తాను తీసుకున్నానని, గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళే బాధ్యత ఇక ఎమ్మెల్యేలదేనని జగన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగన్ చేసిన సూచనలు:

  • గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం
  • జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం
  • అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం
  • గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా నాణ్యతతో చేయండి
  • పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం
  • ప్రజల జీవనప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నాం
  • అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టాం
  • రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి
  • వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలి
  • అధికారంలోకి మామూలుగా రావడంకాదు, మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావాలి
  • కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించా:
  • అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేం?
  • ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం
  • పథకాలకు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం
  • ప్రతినెలా క్యాలెండర్‌ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్‌ నొక్కుతున్నాం
  • ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని నా ధర్మంగా.. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను
  • దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్‌ అయ్యింది

  • దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత
  • ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం
  • ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం
  • అలాంటి పరిస్థితి మనకళ్లముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకేయాలి
  • గతంలో కన్నా.. మెరుగ్గా ఫలితాలు సాధించాలి
  • ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు
  • గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ డబ్బు ఖర్చు
  • ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబంధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇవ్వనున్నాం
  • తర్వాత వెంటనే పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ
  • గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి
  • వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి
  • కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి

గడప,గడపకూ కార్యక్రమాన్ని మానిటర్‌ చేయాలని, దీనికోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని జగన్ పార్టీ నేతలను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్