Thursday, March 28, 2024
HomeUncategorizedGanta: అవి నకిలీ రత్నాలు: గంటా విమర్శ

Ganta: అవి నకిలీ రత్నాలు: గంటా విమర్శ

ఎన్నికల హామీలను నెరవేర్చడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం హామీలను పక్కన పెట్టారని, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సాధించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.  అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేశారని, ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీ చిరంజీవి రావు, పల్లా శ్రీనివాస్ లతో కలిసి గంటా  మీడియాతో  మాట్లాడారు.

జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తయినా కూడా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన హామీల్లో ఏ ఒక్కటీ కేంద్రం నుంచి సాధించలేకపోయారని గంటా అన్నారు.  కేంద్రాన్ని ప్రాధేయపాడడం తప్ప ఏమీ చేయలేమంటూ మొట్టమొదటి ఢిల్లీ పర్యటనలోనే జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.  ఉద్యోగులకు సిపిఎస్ వారంరోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఆ సంగతి పక్కన పెట్టి కనీసం ఒకటో తారీఖున వారికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏ ప్రభుత్వంలో నైనా ఉగ్యోగ సంఘాల నేతలు సిఎంతో నేరుగా మాట్లాడుతుంటారని, కానీ ఈ సిఎంను కలిసేందుకు కూడా వారికి అవకాశం లేకుండా పోయిందన్నారు.

వైసీపీ పాలనలో విధ్వంసం, ప్రతిపక్షాలపై దాడులు, కూల్చివేతలు తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని, ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర ప్రజల నడ్డివిరిచి నిన్నటికి నాలుగేళ్ళ పూర్తయ్యిందంటూ గంటా వ్యాఖ్యానించారు. నవరత్నాలు అంటూ ఆవిష్కరించిన సుందర స్వప్నం ఆవిరైందని, ఎనలేని మేలు చేస్తాయంటూ అంటూ తెరకెక్కించిన నవరత్నాలు నవమోసాలుగా నకిలీ రత్నాలు గా మిగిలిపోయాయని విమర్శలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్