Sunday, September 8, 2024
HomeTrending NewsYSRCP Yatra: సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగన్: మంత్రి విశ్వరూప్

YSRCP Yatra: సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ జగన్: మంత్రి విశ్వరూప్

సామాజిక న్యాయానికి సిఎం జగన్ ఛాంపియన్‌ గా నిలుస్తారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి, ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చారని వివరించారు. బాబు తన హయంలో కేవలం ముగ్గురికే మంత్రిగా అవకాశం ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారని గుర్తుచేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్రకు వేలాది మంది జనం కదలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విశ్వరూప్ మాట్లాడిన ముఖ్యాంశాలు:
* 14 ఏళ్ళ బాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి.
* ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు.
* వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు.
* బాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో రూ.70 పింఛన్‌ ను కనీసం 10 రూపాయలైనా పెంచాడా?
* బాబు 30 లక్షల మందికి పింఛన్‌ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్నాం
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్‌.
* ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్‌ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు.
* మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్‌ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు.
* జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న.
* రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు.
* రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 ఏళ్ళలో ఒక్కరినీ పంపలేదు బాబు.
* ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్‌.
* మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న

కడపలో 

నాలుగున్నరేళ్లలో జగనన్న అన్ని రంగాలలో, అన్ని కులాలవారికి సమన్యాయం చేశారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వేదికపై ఆ వర్గాలకు చెందిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారంటే …ఇక జగనన్న హయాంలో జరిగిన సామాజిక సాధికారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. మాటలతో కాకుండా, చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిన జగనన్న నిజమైన పాలకుడని. మన నాయకుడని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉంటుందని కొనియాడారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అశేషజనం తరలిరావడంలో కడప నగరం జనసంద్రమే అయింది. సామాజిక సాధికారయాత్ర వెంట వేలాదిగా జనం నడిచారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా ఆధ్వర్యం జరిగిన సభలో ఎంపీ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎంపీ బుట్టారేణుక, ఎమ్మెల్సీ పోతుల సునీతలతో పాటు పలువులు ఎమ్మెల్సీలు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, కార్పొరేషన్ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.

మంత్రి ఆదిమూలపు మాట్లాడిన ముఖ్యాంశాలు:
* డప్పుకార్మికులకు, చేనేత వర్గాలకు, చర్మకారులకు, మత్స్యకారులకు ఇలా ఒకటేమిటి అన్ని అణగారిన వర్గాలకు చెయ్యిపట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు జగనన్న.
* అంబేడ్కర్, మహాత్మఫూలే ఆశయాలనే ఆదర్శంగా తీసుకుని…సామాజిక సాధికారత విషయంలో రోల్‌మోడల్‌గా మారారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.
* జగనన్నే మన విశ్వాసం. జగనన్నే మన నమ్మకం.
* నాకు మంచి జరిగివుంటేనే నాకు మద్దతు ఇవ్వండి, ఆశీర్వదించండి అని జగనన్న చెబుతున్నాడు. ఆయన మనకు మంచి చేశాడు. మనం ఆయనకు అండగా ఉండితీరాలి.
* జగనన్న గుండెల్లో కడప ప్రజలు ఉన్నారన్నది మరిచిపోవద్దు. ఇక్కడ నుంచి ఒక ఉపముఖ్యమంత్రిని తయారు చేశారంటే కడప జనం జగనన్నకు ఎంతగా రుణపడిపోయారో అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు గమనిస్తే…కడప నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఎంతో తెలుస్తుంది.

బొబ్బిలిలో…

గత పాలకులు ఈ ప్రాంతాన్ని గత పాలకులు ఎంతలా విస్మరించారో, యువనేత జగన్ సీఎం అయ్యాక ఎలా కలలను సాకారం చేసారో ప్రజలు గమమించాలని ఏపీ డిప్యూటీ సిఎం బూడి ముత్యాల నాయడు విజ్ఞప్తి చేశారు. బ్బిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు.  విజయనగరం జిల్లా బొబ్బిలి గడ్డపై వైసీపీ సామాజిక సాదికార బస్సు యాత్ర అశేష జనవాహిని స్వాగత నినాదాల మద్య ఘనంగా జరిగింది. బొబ్బిలి జంక్షన్ జరిగిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, పుష్పశ్రీ వాణి, బొత్స అప్పలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బూడి మాట్లాడుతూ ఎస్టీ మహిళ అయిన పుష్ప శ్రీవాణి, ఎస్టీ నేత అయిన పీడిక రాజన్నదొర, బీసీ వర్గానికి చెందిన తాను ఉప ముఖ్యమంత్రులుగా ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చొని పాలన సాగించడమే సామాజిక సాధికారతకు నిదర్శనమన్నారు. గడిచిన ఎవరు ఏ పార్టీకి ఓటు వేసారనే లెక్క లేకుండా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చిన ముఖ్యమంత్రి దేశంలో జగన్ ఒక్కరేనన్నారు. రైతు, డ్వాక్రా రుణాల మాపీ విషయంలో చంద్రబాబు పంగనామాలు పెట్టి మోసం చేస్తే, జగన్ సీఎం జగన్ కాగానే బాబు ఎగ్గొట్టిన అప్పులన్నీ తీరుస్తున్నరాన్నారు. వచ్చే జనవరి నుంచి అవ్వా తాతలకు పించన్ రూ. 3 వేలు చేయబోతున్నారని, ఎప్పుడూ రెండు వేళ్లు చూపే టీడీపీ నేతలకు పండగ నుంచి మూడు వేలు తీసుకుని వారికి మూడు వేళ్లు చూపాలని పిలుపునిచ్చారు.

బొబ్బిలి ఎమ్మెల్యే శంబంంగి చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, హయాంలోనూ, ఇప్పుడు వైఎస్ జగన్ సారథ్యంలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి నాలుగున్నరేళ్లలో 11,500 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందించామని, మరో 4,500 ఎకరాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతి లేని పాలనను దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అందిస్తున్నారని వివరించారు. మాట తప్పని, మడమ తిప్పని ఖ్యాతి జాతీయ స్థాయిలో జగన్ కు మాత్రమే ఉందన్నారు. బొబ్బిలి రాజులను నమ్ముకుంటే సొంత డబ్బుతోనైనాఆదుకుంటారని ప్రచారం చేసుకుంటే ప్రజల నమ్మి గెలిపిస్తే సొంత ఆస్తులే పెంచుకుని ఓటర్లను వంచించుకున్నారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్