Tuesday, June 9, 2026
HomeTrending Newsరెవిన్యూ లోటు భర్తీ చేయండి: సిఎం జగన్

రెవిన్యూ లోటు భర్తీ చేయండి: సిఎం జగన్

Pls look into it: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం తరువాత పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుసుకున్నారు. తొలుత  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. రెవిన్యూ లోటు భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు… ఇతర కార్యక్రమాలకు ఖర్చుచేసిన రూ.32,625.25 కోట్లను భర్తీచేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ అదనపు రుణాలకు సరిపడా… రాష్ట్ర రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదని, దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తిచేశారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం.. తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు.

ఆ తర్వాత కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎంవిజ్ఞప్తిచేశారు. టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిరరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్‌ వారీగా కాకుండామొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. వరదకారణంగా దెబ్బతిన్న ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం పునాదులకు సంబంధించి ఈ సమావేశంలోకూడా చర్చజరిగింది. దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారుచేసిన అంశాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాంకు సంబంధించి డయాఫ్రం వాల్‌ ఎలా పటిష్టంచేయాలి? లేదా కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై వరుసగా నిపుణులతో చర్చలు జరుపు తున్నామని, ఇవి కూడా వారం పదిరోజుల్లో ఖరారు అవుతాయని సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశమయ్యారు.

Also Read : సిపిఐ (చంద్రబాబు) పార్టీ పెట్టుకోండి: పేర్ని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular