Saturday, January 18, 2025
HomeTrending Newsఈనెల 27న వైసీపీ కీలక భేటీ

ఈనెల 27న వైసీపీ కీలక భేటీ

YSRCP Meeting: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అటు పాలనతోపాటు ఇటు పార్టీపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఏప్రిల్ 11న మంత్రివర్గ  పునర్ వ్యవస్థీకరణ చేసిన సిఎం, గత వారం పార్టీ రీజినల్ కోర్దినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించిన సంగతి తెలిసిందే.  ఈనెల 27వ తేదీన కొత్త మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశం కానున్నారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 27వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సమావేశం మొదలు కానుంది.  క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరు తెన్నులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ నేతలకు, మంత్రులకు సిఎం జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. మంత్రులు  జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి ఎలా ముందుకు సాగాలనే విషయమై సిఎం ఒక యాక్షన్ ప్లాన్ ను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్ల నియామకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్