Sunday, September 22, 2024
HomeTrending NewsJagjivan Ram Jayanti: సమతావాది బాబు జగ్జివన్ రాం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jagjivan Ram Jayanti: సమతావాది బాబు జగ్జివన్ రాం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారత దేశ సమాతావా ది జగ్జీవన్ రాం ఆశయాలను కొనసాగించాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కార్మిక శాఖ మంత్రి గా కనీస వేతన చట్టాన్ని తీసుకు వచ్చిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అన్నారు. రక్షణ శాఖ మంత్రిగా పాకిస్థాన్ యుద్ధంలో విజయం సాదించడంలో కీలక పాత్ర పోషించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు బాటలు వేశారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ…అన్నివర్గాల ప్రజలకు స్ఫూర్తి ప్రదాత జగ్జీవ న్ రాం అని కొనియాడారు. జగ్జీవన్ రాం రాజనీతిజ్ఞుడు.. అని స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా నిమ్న వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు జగ్జివన్ రాం కూతురు మీరాకుమారీ కీలక పాత్ర పోషించారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఆర్థిక నేరగాళ్ల ను విమర్శించింనందుకు, అదానీ షెల్ కంపెనీల పై నిలదీసినందుకు రాహుల్ గాంధీకి శిక్ష వేసి, వెంటనే పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేశారని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రను ప్రజాస్వామ్య వాదులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం రూపొందించిన చట్టాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అవేదన్ వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నజరానా ఇవ్వలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్, రాజీవ్ గాంధీ పంచాయత్ రాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, సీనియర్ నాయకులు తాటిపర్తి దేవేందర్ రెడ్డి, గాజుల రాజేందర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, పిసిసి ఎన్ ఆర్ ఐ కన్వీనర్ చాంద్ పాషా, కౌన్సిలర్ నక్క జీవన్, కమటాలశ్రీనివాస్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా మధు, గోపి,బీరం రాజేష్ పాల్గొన్నారు.

Also Read : Jagjivan Ram: బాబూ జగ్జీవన్ కు సిఎం జగన్ నివాళి

RELATED ARTICLES

Most Popular

న్యూస్