Monday, May 20, 2024
Homeసినిమానాకు ఇదో మధురానుభూతి: శ్రీ సిద్ది మహేష్

నాకు ఇదో మధురానుభూతి: శ్రీ సిద్ది మహేష్

కోవిడ్ బాధితులకు, ఆపన్నులకు మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రముఖ సంగీత దర్శకులు , గేయ రచయిత చరణ్ అర్జున్ ” జై చిరంజీవ… జై చిరంజీవా ”అనే ఓ పాటను రచించారు. దీనికి శ్రీ సిద్ది మహేష్ దర్శకత్వం వహించగా బీవీఎమ్ శివ శంకర్ నిర్మించారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో విశేష ఆదరణ పొందుతూ మెగాభిమానులకు మరింత స్ఫూర్తినిస్తోంది.

https://www.youtube.com/watch?v=nBSZdXwYU4o

ఈ పాటని ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ యూనిట్ సభ్యులను అభినందించారు. అలాగే ప్రముఖ దర్శకుడు సంపత్ నందితో పాటుగా గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఈ పాటను శుభాకాంక్షలు అందజేశారు. మెగాస్టార్ వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా ఉన్న ఇంత గొప్ప పాటకు దర్శకత్వం వహించే అవకాశాన్ని నాకు అందించిన చరణ్ కు, నిర్మాత శివశంకర్ కు నా కృతఙ్ఞతలు అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు దర్శకుడు శ్రీ సిద్ది మహేష్.

కరోనా రెండో దశలో ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ప్రజలకు అండగా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలలోన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు చిరు. షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న 14 వేల మంది సినీ కార్మికులకు ”కరోనా క్రైసిస్ చారిటీ ” అనే సంస్థని నెలకొల్పి సినిమా రంగంలోని పలువురు హీరోలను , హీరోయిన్ లను అందులో భాగస్వాములను చేసి సినీ కార్మికులకు నాలుగు నెలల పాటు నిత్యావసరాలు అందించారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు నటీనటులను ఆర్ధికంగా ఆదుకున్నారు చిరంజీవి. ఇలాంటి ఓ గొప్ప నటుడిపై ఓ పాటను చిత్రీకరించే అవకాశం రావడం తన జీవితంలో ఓ గొప్ప అనుభూతిగా మిలిగిపోతుందని గర్వంగా చెబుతున్నారు శ్రీ సిద్ది మహేష్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్