Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్జైస్వాల్ మరో డబుల్ సెంచరీ, ఇండియా 430/4 డిక్లేర్డ్

జైస్వాల్ మరో డబుల్ సెంచరీ, ఇండియా 430/4 డిక్లేర్డ్

క్రికెట్ లో యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఒక సిరీస్ లో రెండో డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ లో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్  రాజ్ కోట్ లో జరుగుతోన్న మూడో మ్యాచ్ లో కూడా రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్  తొలి ఇన్నింగ్స్ లో కేవలం 10 పరుగులే చేసిన ఈ యంగ్ తరంగం నిన్న సెంచరీ (104) పూర్తి చేసి గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

2 వికెట్లకు 196 పరుగుల వద్ద 322 పరుగుల ఆధిక్యంతో నేడు నాలుగోరోజు ఆట ఇండియా మొదలు పెట్టింది. జట్టు స్కోరు 246 వద్ద 91 రన్స్ సాధించి సెంచరీ కి చేరువలో ఉన్న శుభ్ మన్ గిల్ రనౌట్ అయ్యాడు. ఈ దశలో జైస్వాల్ మళ్ళీ క్రీజులో అడుగు పెట్టాడు. ఆ కాసేపటికే కుల్దీప్ యాదవ్ (27) కూడా పెవిలియన్ చేరాడు. సర్ఫ్ రాజ్ ఖాన్-జైస్వాల్ లు వేగంగా ఆడి స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. తొలి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ చేసిన సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్ లో సైతం  66 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ కాసేపటికే జైస్వాల్ ద్వి శతకం పూర్తి చేశాడు.  231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లతో ఈ ఘనత సాధించిన జైస్వాల్ ఆ వెంటనే రెండు వరుస బంతులను స్టాండ్స్ లోకి పంపి టెస్ట్ క్రికెట్ లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డును సమం చేశాడు.

జైస్వాల్ 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్సర్లతో 214; సర్ఫ్ రాజ్ 72 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 68  పరుగులతో… జట్టు స్కోరు 4 వికెట్లకు 430 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశారు.  556 రన్స్ ఆధిక్యం ఇండియా సంపాదించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్