Wednesday, April 16, 2025
HomeTrending Newsజర్నలిస్టు ముసుగులో ఉగ్రవాదం

జర్నలిస్టు ముసుగులో ఉగ్రవాదం

జమ్మూకశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు తెల్లవారుజామున నుంచి ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్ లోని రైనవారి ప్రాంతంలో టెర్రరిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు టెర్రరిస్టులను హతమార్చాయి.

హతమైన ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. రాయిస్ అహ్మద్ భట్.. అనే ఉగ్రవాది జర్నలిస్టుగా చెలామణి అవుతున్నాడు. అనంత్ నాగ్ లో ఆన్ లైన్ న్యూస్ పోర్టల్  ‘వ్యాలీన్యూస్ సర్వీస్’ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. 2021 నుంచి ఇతను ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. ఉగ్రవాద నేరాలకు సంబంధించి అతనిపై ఇప్పటికే రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. హతమైన రెండో ఉగ్రవాదిని బిజ్‌బెహరాకు చెందిన హిలాల్‌ అహ్‌ రాహ్‌గా గుర్తించామని, ఆయన ‘సి’ కేటగిరీ ఉగ్రవాది అని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్