Janani Song: Emotional :
దేశంలో ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సంచలన చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్’. యంగ్ టైర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇప్పటి వరకు ‘దోస్తీ దోస్తీ’, ‘నాటు నాటు’ సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ‘జనని.. ‘అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్‌ఆర్’ సోల్ యాంథమ్ జనని అంటూ విడుదల చేసిన ఈ పాటను కీరవాణి స్వరపరిచి ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, శ్రియ తదితరులను చూపించారు. ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. ఆద్యంతం భావోద్వేగంతో సాగింది.
ఇందులో ఎన్టీఆర్, చరణ్ ల ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే.. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి నటించినట్టుగా అనిపిస్తుంది. ఇలా రిలీజ్ చేసారో లేదో అలా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతుంది.
Also Read : ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ పై రాజమౌళి క్లారిటీ