Sunday, February 25, 2024
Homeసినిమా‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్ పై రాజ‌మౌళి క్లారిటీ

‘ఆర్ఆర్ఆర్’ ట్రైల‌ర్ పై రాజ‌మౌళి క్లారిటీ

RRR Trailer : 
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన‌ టీజ‌ర్, సాంగ్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ ఇంకా రిలీజ్ కాలేదు. అయితే.. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ట్రైల‌ర్ రిలీజ్ కానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. సినిమా రిలీజ్ నెల రోజులు ఉంద‌న‌గా ట్రైల‌ర్ రిలీజ్ చేస్తారా..? ఇదేదో గాసిప్ అనుకున్నారు కానీ.. జ‌క్క‌న్న ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ప్ర‌మోష‌న్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రేపు ఆర్ఆర్ఆర్ నుంచి జ‌న‌ని అనే సాంగ్ రిలీజ్ చేయ‌నున్న సంద‌ర్భంగా మీడియా ముందుకు వ‌చ్చిన రాజ‌మౌళి సినిమా ట్రైల‌ర్ ను డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నట్లు  ప్ర‌క‌టించారు.

అలాగే ఈ సినిమాకు ఒకటి కాదని, నెంబ‌ర్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయ‌ని.. అలాగే ఈ సినిమాపై మీడియా అడిగే అన్ని ప్ర‌శ్న‌ల‌కు త్వ‌ర‌లోనే ప్రెస్ కాన్ఫిరెన్స్ ద్వారా స‌మాధానాలు చెబుతాన‌ని చెప్పారు. సో.. ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో రిలీజ్ కావ‌డం ఖాయమైంది.

Also Read : భావోద్వేగంతో సాగే ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్