Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

RRR Emotional Song:
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌డంతో ‘ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొనిఉన్నాయి. అయితే..  ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో మ‌రింత స్పీడు పెంచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ‘దోస్తీ సాంగ్’, ‘నాటు నాటు’ పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డం.. ఈ రెండు పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇప్పుడు ‘జనని’ అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు రాజమౌళి తెలియ‌చేశారు. ఈ పాట‌ను ఈ నెల 26న రిలీజ్ చేయ‌నున్నారు. పెద్దన్నకీరవాణి స్వరపరిచిన పాట భావోద్వేగంతో సాగుతుందంటూ ఓ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

MUST Read : క‌న్నుల పండుగ‌లా ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ పాట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com