Saturday, July 27, 2024
HomeTrending Newsరెండూ వేర్వేరు అంశాలు: కిషన్ రెడ్డి

రెండూ వేర్వేరు అంశాలు: కిషన్ రెడ్డి

Tourism in AP:

పర్యాటక రంగ అభివృద్ధికి, రాజధానికి సంబంధం లేదని, రెండూ వేర్వేరు అంశాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు విశాఖపట్టణం నగరంలో కిషన్ రెడ్డి పర్యటించారు, బావికొండ బౌద్ధ క్షేత్రాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. స్వదేశ్ ప్రాజెక్టు కింద ఈ క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 18 కోట్ల రూపాయలతో అల్లూరి సీతారామరాజు పేరిట గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని వివరించారు. విశాఖ నగరంలో కూడా బీచ్, కొండలు, సముద్రం ఇలా ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, వాటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు త్వరలోనే అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు ఉన్నాయని వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరం చెన్నై అని, వారంతా తిరుపతి పుణ్యక్షేత్రం కోసం వచ్చి చెన్నై విమానాశ్రయంలో దిగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించి కేంద్రం అభివృద్ధి చేస్తోందని, భవిష్యత్తులో విదేశాల నుంచి వచ్చే భక్తులు నేరుగా రేణిగుంటలోనే దిగే విధంగా  తీర్చిదిద్దుతామని వెల్లడించారు.

Also Read : రాష్ట్రానికి భారీగా టూరిజం ప్రాజెక్టులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్