Sunday, January 19, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీ కోసం జాన్వీ అంతలా ఎదురు చూస్తుందా.?

ఎన్టీఆర్ మూవీ కోసం జాన్వీ అంతలా ఎదురు చూస్తుందా.?

జాన్వీ కపూర్.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే.. ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్స్ ఇంకా సాధించలేదు. ఈ అమ్మడును తెలుగు తెరకు పరిచయం చేయాలని టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎంత పెద్ద ఆఫర్స్ వచ్చినా జాన్వీ నో చెప్పేది. ఒకానొక టైమ్ లో జాన్వీకి తెలుగు సినిమాల్లో నటించడం ఇష్టం లేదా..? తెలుగు సినిమాల్లో నటించదా..? అనే అనుమానాలు, ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే.. అలాంటిది ఏమీ లేదు.. ఖచ్చితంగా నటిస్తుందని బోనీ కపూర్ క్లారిటీ ఇచ్చారు.

అయితే.. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించే ఆ సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీలో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో తెలుగులో ఎవరితో నటించాలని ఉందని అడిగితే.. ఎన్టీఆర్ తో నటించాలని ఉందని చెప్పింది. ఈ అమ్మడు అలా చెప్పిందో లేదో.. ఇలా ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జాన్వీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ మూవీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక తన అభిమాన హీరో ఎన్టీఆర్ తో చేస్తున్న మూవీ కావడంతో పాటు తెలుగులోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తుండడంతో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. తాజాగా ఒక మీడియా సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ… ఇప్పటికే దర్శకడు కొరటాల శివకి పలుమార్లు మెసేజ్ చేసానని, రెఫరెన్స్ లు  కోసం ఆయనని అడుగుతున్నానని అన్నారు. ఆ విధంగా మూవీ షూట్ కోసం తాను రోజులు లెక్కిస్తున్నానని చెప్పింది. అంతే కాకుండా.. ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీ మరొక్కసారి చూశాను. అభిమాన హీరో ఎన్టీఆర్ తో యాక్ట్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా జాన్వీ చెప్పడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్