Saturday, January 18, 2025
Homeసినిమానాని జోడిగా జాన్వీ కపూర్!

నాని జోడిగా జాన్వీ కపూర్!

జాన్వీ కపూర్ బాలీవుడ్ బ్యూటీ. శ్రీదేవి కూతురు అనే క్రేజ్ తనకి విపరీతంగా ఉంది. తను బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. అయితే ఇంతవరకూ ఆమె స్థాయికి తగిన హిట్ పడలేదనే చెప్పాలి. అయితే ఆమె సినిమాల పరంగా కంటే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. టాలీవుడ్ కి ఆమెను పరిచయం చేయడానికి చాలామంది మేకర్స్ ప్రయత్నించారు. ఏ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అనే ఒక కుతూహలం చాలా కాలం పాటు కొనసాగుతూ వచ్చింది.

చివరికి ఎన్టీఆర్ జోడీగా ‘దేవర’ చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, త్వరలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగు పూర్తి కావడానికి ముందే ఆమె చరణ్ తో ఒక ప్రాజెక్టు చేయడానికి ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలను కూడా పూర్తిచేసుకుంది. చరణ్ – జాన్వీ జోడీ ఎలా ఉంటుందా అనే ఒక ఆసక్తి మెగా అభిమానులలో ఉంది.

ఇక ఈ నేపథ్యంలోనే ఆమె తదుపరి సినిమా నాని సరసన ఉండనుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలో నాని చేయనున్న సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నట్టు సమాచారం. తమ టీమ్ ఆ ప్రయత్నాలు చేస్తుందేమో .. తనకి తెలియదు అని నాని అనడం విశేషం. అయితే ‘దేవర’ విడుదల తరువాత ఆమె ఎంపికను ఖరారు చేసే పనిలో టీమ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ‘దేవర’ గనుక హిట్ అయితే ఇక్కడ జాన్వీ జోరు కొనసాగడం ఖాయంగానే కనిపిస్తోంది మరి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్