Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్IND(W)-BAN(W): జేమైమా రోడ్రిగ్యూస్ ఆల్-రౌండ్ షో; ఇండియా ఘన విజయం

IND(W)-BAN(W): జేమైమా రోడ్రిగ్యూస్ ఆల్-రౌండ్ షో; ఇండియా ఘన విజయం

జేమైమా రోడ్రిగ్యూస్ ఆల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటడంతో బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండో వన్డేలో ఇండియా 108 పరుగులతో ఘన విజయం సాధించింది.  ఇండియా-బంగ్లా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  సిరీస్ లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన దశలో… టాస్ ఓడిపోయి  తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో  8 వికెట్లు కోల్పోయి 228  పరుగులు చేసింది. 68 పరుగులకు మూడు వికెట్లు ( ప్రియా పునియా-7; యస్తికా భాటియా-15; స్మృతి మందానా-36) కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్- జెమైమా లు  నాలుగో వికెట్ కు 131 పరుగులు జోడించారు. కెప్టెన్ హర్మన్ 52; రోడ్రిగ్యూస్ 78 బంతుల్లో 9 ఫోర్లతో 86 రన్స్ చేసి ఔటయ్యారు. హర్లీన్ డియోల్ 25 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతున్, నహిదా అక్తర్ చెరో 2; మరుఫా అక్తర్, రాబెయా ఖాన్ చెరో వికెట్ సాధించారు.

లక్ష్య సాధనలో 38 రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయింది. ఫర్ఘానా హక్-47; రితూ మోనీ-27 ; ముర్షీదా ఖాతున్-12 మినహా మిగిలిన ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. 35.1  ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రోడ్రిగ్యూస్ 4; దేవికా వైద్య 3 వికెట్లతో బంగ్లా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూల్చారు. మేఘనా సింగ్, దీప్తి శర్మ, స్నెహ్ రాణా  తలా ఒక వికెట్ పడగొట్టారు.

రోడ్రిగ్యూస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్